రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడు మృతి
ABN , First Publish Date - 2020-12-17T06:04:49+05:30 IST
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు మృతి చెందినట్టు గొలుగొండ పోలీసులు తెలిపారు.

గొలుగొండ, డిసెంబరు 16 : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు మృతి చెందినట్టు గొలుగొండ పోలీసులు తెలిపారు. మండల శివారు గ్రామమైన జి.కొత్తూరు జంక్షన్ వద్దకు నర్సీపట్నానికి చెందిన వాగోలు ఏసుబాబు (69) ఈ నెల 10వ తేదీ ఉదయం వాకింగ్ చేస్తూ వచ్చారు. ఇంతలో వెనుక నుంచి వస్తున్న బైక్ అతనిని ఢీకొంది. తీవ్ర గాయాలకు గురికావడంతో కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.