భెల్‌ ఎన్నికల నామినేషన్‌లు ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-03T05:38:04+05:30 IST

గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో పోటీ చేసెందుకు సోమవారం మూడు ఫ్రంట్‌లతోపాటు మరొక కార్మిక సంఘం నామినేషన్‌లు దాఖలు చేశాయి

భెల్‌ ఎన్నికల నామినేషన్‌లు ప్రారంభం
భెల్‌ హెచ్‌పీవీపీ

అక్కిరెడ్డిపాలెం: భెల్‌ హెచ్‌పీవీపీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో పోటీ చేసెందుకు సోమవారం మూడు ఫ్రంట్‌లతోపాటు మరొక కార్మిక సంఘం నామినేషన్‌లు దాఖలు చేశాయి. ఈ నెల 10న జరగనున్న ఈ ఎన్నికలకు  సోమవారం ఏఐటీయూసీ బ్యానర్‌పై టీఎన్‌టీయూసీ, బీహెచ్‌పీవీ ఎంఎస్‌ సంయుక్తంగా  యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్యానల్‌పై నామినేషన్‌ దాఖలు చేశాయి. ఇంటక్‌, వైఎస్‌ఆర్‌టీయూసీ సంయుక్తంగా ప్రొగ్రసివ్‌ ఫ్రంట్‌ ప్యానల్‌పై, సీఐటీయూ పరిరక్షణా ఫ్రంట్‌ ప్యానల్‌పై పోటీ చేసేందుకు నామినేషన్‌లు దాఖలు చేశాయి. బీఎంఎస్‌ కార్మిక సంఘం కూడా నామినేషన్‌ దాఖలు చేసినప్పటికీ కేవలం మూడు ప్రంట్‌ల మధ్యే పోటీ వుంటుందని భావిస్తున్నారు. బుధవారం నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం అదేరోజు ఎన్నికల గుర్తులు ప్రకటించనున్నారు.

Updated Date - 2020-11-03T05:38:04+05:30 IST