పడిపోయిన బస్తరు పిక్కలు ధర
ABN , First Publish Date - 2020-12-04T05:29:41+05:30 IST
జెన్సీలో తెల్లపిక్కలు(బస్తరు) ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం క్రితం కిలో తెల్లపిక్కలు రూ.50కి కొనుగోలు చేసిన వర్తకులు గురువారం కిలో రూ.20కి మాత్రమే కొనుగోలు చేశారు.

గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల విజ్ఞప్తి
గూడెంకొత్తవీధి, డిసెంబరు 3:
ఏజెన్సీలో తెల్లపిక్కలు(బస్తరు) ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం క్రితం కిలో తెల్లపిక్కలు రూ.50కి కొనుగోలు చేసిన వర్తకులు గురువారం కిలో రూ.20కి మాత్రమే కొనుగోలు చేశారు. తెల్లపిక్కలను కేవలం ప్రైవేటు వర్తకులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ గాని, జీసీసీ గాని మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఆదివాసీ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.