భైరవస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2020-12-15T06:05:51+05:30 IST

భైరవవాకలో కొలువుదీరిన భైరవస్వామి దర్శనానికి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భైరవస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
గుమ్మడి దీపాలు వెలిగిస్తున్న భక్తులు

సింహాచలం, డిసెంబరు 14: భైరవవాకలో కొలువుదీరిన భైరవస్వామి దర్శనానికి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామికి ప్రీతికరమైన అమావాస్య కావడంతో ఉత్తరాంధ్రాతో పాటు ఒడిశా సరిహద్దు జిల్లాల నుంచి సుమారు 20 వేల మంది తరలిరావడంతో మెయిన్‌రోడ్డులో వాహనాల రాకపోకలకు స్వల్ప ఇబ్బంది ఏర్పడింది. భక్తులంతా భైరవుని సన్నిఽదిలో గుమ్మడి దీపాలు వెలిగించి, స్వామికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. గోపాలపట్నం ట్రాఫిక్‌ ఎస్‌ఐ వెంకటరావు ఆధ్వర్యంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.


భక్తులకు వసతులు కల్పిస్తాం: మంత్రి ముత్తంశెట్టి 

భైరవస్వామి దర్శనానికి భక్తుల తాకిడి పెరుగుతున్నందున వారికి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భైరవస్వామిని దర్శించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు ఎర్ర వరంబాబు, నడింపల్లి రామరాజు భక్తుల సమస్యలను మంత్రి దృష్టికి తేవడంతో ఆయన అటవీశాఖ, సింహాచల దేవస్థానం అదికారులతో ఫోన్‌లో మాట్లాడారు. భైరవస్వామిని దర్శించే భక్తులకు నీడను, తాగునీరు, రహదారి వంటి వసతుల కల్పనకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
Updated Date - 2020-12-15T06:05:51+05:30 IST