అన్ని రకాల పంటలకు పరిహారం చెల్లిస్తాం
ABN , First Publish Date - 2020-12-06T04:08:25+05:30 IST
విశాఖ- రాయపూర్ ఎక్సప్రెస్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వారి భూముల్లో సాగులో ఉన్న ప్రతి పంట, చెట్లు, బావులు, బోర్లుకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఎన్హెచ్-16 డిప్యూటీ తహసీల్దార్ రాజావిక్రమార్క్ తెలిపారు.

డిప్యూటీ తహసీల్దార్ రాజా విక్రమార్క్
సబ్బవరం, డిసెంబరు 5 : విశాఖ- రాయపూర్ ఎక్సప్రెస్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వారి భూముల్లో సాగులో ఉన్న ప్రతి పంట, చెట్లు, బావులు, బోర్లుకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఎన్హెచ్-16 డిప్యూటీ తహసీల్దార్ రాజావిక్రమార్క్ తెలిపారు. మండలంలోని మలునాయుడుపాలెంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా భూములు పరిశీలించి సర్వే నంబర్లు వారీ సర్వే చేస్తామని, తరువాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. పరిహారం చెల్లించాకే భూములు అభివృద్ధి చేస్తామని రైతులకు వివరించారు. రైతులకు ఉన్న పలు అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు సబ్బవరపు త్రినాఽథరామకాసు, రైతులు బోని గంగునాయుడు, మాజీ ఎంపీపీ గండి దేముడు, మాజీ ఎంపీటీసీ శింగంపల్లి సత్యం, పి.దేముడు తదితరులు పాల్గొన్నారు.