ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
ABN , First Publish Date - 2020-12-12T04:58:01+05:30 IST
ఉద్యాన సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభించడం ద్వారానే ఉద్యాన రైతులు అధిక దిగుబడులు సాధించగలరని జిల్లా ఉద్యాన సహాయ సంచాలకులు కె.శైలజ అన్నారు.
సబ్బవరం, డిసెంబరు 11 : ఉద్యాన సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభించడం ద్వారానే ఉద్యాన రైతులు అధిక దిగుబడులు సాధించగలరని జిల్లా ఉద్యాన సహాయ సంచాలకులు కె.శైలజ అన్నారు. మండలంలోని దేవీపురంలో శుక్రవారం ఉద్యానాధికారి జి.రాధిక వైఎస్సార్ తోటబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ బిందు సేద్యం, మల్చింగ్ షీట్ వినియోగం, ట్రెల్లీలు, పందిర్ల నిర్మాణం వంటి ఆధునిక ఉద్యాన పద్ధతులను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకులు లోవరాజు, సత్యవతమ్మ, భీశెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
పొలంబడితో అధిక దిగుబడులు
పరవాడ: పొలంబడితో రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్.కోటేశ్వరరావు తెలిపారు. తానాంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పొలంబడి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ 14 వారాల పాటు పొలంబడి గురించి రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా పలు సలహాలు, సూచనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి చంద్రవతి, ఏఈవోలు సంజీవరావు, వరలక్ష్మి, అగ్రికల్చర్ అసిస్టెంట్ జ్యోతి, సుందరరావు తదితరులు పాల్గొన్నారు.