బలిమెల నీటి వాడకంపై లెక్కలు

ABN , First Publish Date - 2020-11-13T05:39:59+05:30 IST

బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు గురువారం చిత్రకొండలో సమావేశమై చర్చించారు.

బలిమెల నీటి వాడకంపై లెక్కలు
బలిమెల నీటి వినియోగంపై చిత్రకొండలో సమావేశమైన అధికారులు

జలాశయంలో 109.4664 టీఎంసీల నీరు

ఏపీకి 52.3834 టీఎంసీలు, ఒడిశాకు 57.0830 టీఎంసీలు పంపిణీ


సీలేరు, నవంబరు 12: బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు గురువారం చిత్రకొండలో సమావేశమై చర్చించారు. ఒడిశా ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు 36.3836 టీఎంసీలు, ఏపీ 41.0832 టీఎంసీలు (గత నీటి సంవత్సరంలో అధికంగా వాడుకున్న 22.6141 టీఎంసీలతో కలిపి) వినియోగించినట్టు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం జలాశయంలో 109.4664 టీఎంసీల నీరు వుండగా, ఇందులో ఏపీకి 52.3834 టీఎంసీలు, ఒడిశాకు 57.0830 టీఎంసీలు పంపిణీ చేశారు. ప్రస్తుతం విద్యుత్తు, ఇరిగేషన్‌ అవసరాల నిమిత్తం ఏపీ 2000 క్యూసెక్కులు, ఒడిశా 4,500 క్యూసెక్కులు వినియోగించుకునేలా అంగీకారం కుదిరింది. ఈ సమావేశంలో ఒడిశా తరపున పొట్టేరు ఇరిగేషన్‌ ప్రాజెక్టు సీఈ కైలాస్‌ చంద్రసాహో, చిత్రకొండ డ్యామ్‌ ఈఈ కబీప్రసాద్‌నాథ్‌, బలిమెల డీఈఈ సనాతన్‌ సాహో, ఏఈవు సురేష్‌చంద్ర, ఉమాశంకర్‌ సాహో, గడాధర్‌ ప్రధాన్‌; ఏపీ తరపున సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈ రామకోటిలింగేశ్వరరావు, ఈఈ షేక్‌ జాకీర్‌హుస్సేన్‌, ఏడీఈ టి.అప్పటనాయుడు, ఏఈ  ఎం.కుమార్‌శర్మ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-13T05:39:59+05:30 IST