-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Baby safe
-
పోలీసుల చొరవతో బాలికకు షెల్టర్
ABN , First Publish Date - 2020-11-21T05:42:30+05:30 IST
రోడ్డుపై సంచరిస్తున్న ఓ బాలికను స్థానికులు, పోలీసులు ఆదరించి, చిల్డ్రన్ హోంకు తరలించి మానవ త్వాన్ని చాటుకున్నారు.

ఉద్దండపురం హైవేపై సంచరిస్తుండగా గుర్తింపు
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన చంటిగా వెల్లడి
చిల్డ్రన్స్ హోంకు తరలింపు
నక్కపల్లి, నవంబరు 20 : రోడ్డుపై సంచరిస్తున్న ఓ బాలికను స్థానికులు, పోలీసులు ఆదరించి, చిల్డ్రన్ హోంకు తరలించి మానవ త్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలివి. ఉద్దండపురం హైవేపై 12 సంవత్స రాల బాలిక గురువారం రాత్రి తిరుగుతుండడాన్ని గ్రామస్థులు గుర్తించారు. అదే సమయంలో అటుగా వస్తున్న కాగిత గ్రామ మహిళా పోలీస్ శిరీషకు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఆమె బాలికను తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి, కొత్త దుస్తులు తొడిగి, ఆ రాత్రికి షెల్టరు ఇచ్చారు. బాలిక వివరాలపై ఆరా తీయగా, కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన చంటిగా తేలింది. దీంతో శుక్రవారం నక్కపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఎస్‌ఐ అప్పన్న ఆ బాలికకు భోజనం ఏర్పాటు చేసి, కొవిడ్ పరీక్ష చేయించారు. అనంతరం విశాఖలోని చిల్డ్రన్ హోమ్‌కు తరలించారు. పోలీసు సిబ్బంది సేవలను సీఐ విజయ్‌కుమార్ అభినందించారు.