అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.10 విరాళం ఇవ్వండి : అయ్యన్న

ABN , First Publish Date - 2020-08-01T09:42:54+05:30 IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి హిందువు రూ.10 చొప్పున విరాళం ఇచ్చి పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ..

అయోధ్య రామమందిర నిర్మాణానికి  రూ.10 విరాళం ఇవ్వండి : అయ్యన్న

నర్సీపట్నం టౌన్‌, జూలై 31 : అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి హిందువు రూ.10 చొప్పున విరాళం ఇచ్చి పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాముడు జన్మించిన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి వాజపేయి, ఎల్‌కే అద్వానీ వంటివారు ప్రయత్నం చేశారన్నారు. కానీ ఇన్నేళ్లకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రామమందిర నిర్మాణం జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని  పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం  కావాలన్నారు.


Updated Date - 2020-08-01T09:42:54+05:30 IST