దిశ, ఏపీ పోలీస్‌ యాప్‌లపై అవగాహన పెంచండి

ABN , First Publish Date - 2020-12-17T06:11:18+05:30 IST

ప్రతి ఇంట్లో మహిళల సెల్‌ ఫోన్‌లో దిశ, ఏపీ పోలీస్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసి, వాటిపై పూర్తి అవగాహన కల్పించాలని సీఐ స్వామినాయుడు సూచించారు.

దిశ, ఏపీ పోలీస్‌ యాప్‌లపై అవగాహన పెంచండి
మాట్లాడుతున్న సీఐ స్వామినాయుడు

నర్సీపట్నం, డిసెంబరు 16 : ప్రతి ఇంట్లో మహిళల సెల్‌ ఫోన్‌లో దిశ, ఏపీ పోలీస్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసి, వాటిపై పూర్తి అవగాహన కల్పించాలని సీఐ స్వామినాయుడు సూచించారు. మునిసిపాలిటీలోని వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులతో బుధవారం ఇక్కడ ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. వార్డులోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వలంటీర్ల సహాయంతో గుర్తించి సమాచారం ఇవ్వాలన్నారు. సారా విక్రయాలు, గంజాయి, ఇసుక అక్రమరవాణా కట్టడికి దృష్టిసారించాలన్నారు. ఎస్‌ఐలు లక్ష్మణరావు, రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-17T06:11:18+05:30 IST