-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Awards to AMC at AP Medican
-
ఏపీ మెడికాన్‌లో ఏఎంసీకి అవార్డులు
ABN , First Publish Date - 2020-12-15T05:30:00+05:30 IST
ఏపీ మెడికాన్ రాష్ట్ర సదస్సులో ఆంధ్ర వైద్య కళాశాలకు అవార్డులు వచ్చాయని ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు.

మహారాణిపేట, డిసెంబరు 15: ఏపీ మెడికాన్ రాష్ట్ర సదస్సులో ఆంధ్ర వైద్య కళాశాలకు అవార్డులు వచ్చాయని ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు. స్విమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ వార్షిక సదస్సును ఈ నెల 12, 13న వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. పర్సెప్షన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ టు వార్డ్సు ఎంసీక్యూ ఇన్ ఇవాల్యూవేషన్ అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు. కమ్యూనిటీ మెడిసిన్ మొదటి సంవత్సరం పీజీ వైద్య విద్యార్థులు పి.సాయికిరణ్, ఎ.నివేత, రష్మిత, రామలక్ష్మి, వాహిని, ప్రియదర్శినితో పాటు మరికొందరు అవార్డులను సాధించారన్నారు.