భక్తిశ్రద్ధలతో మేలుకొలుపు

ABN , First Publish Date - 2020-12-20T05:05:21+05:30 IST

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పరవాడ రామాలయం వద్ద శనివారం మేలుకొలుపు కార్యక్రమాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో మేలుకొలుపు
మేలుకొలుపు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు

పరవాడ, డిసెంబరు 19: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పరవాడ రామాలయం వద్ద శనివారం మేలుకొలుపు కార్యక్రమాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్‌ మండల కన్వీనర్‌ చుక్క సన్యాసిరావు, సభ్యులు వానపల్లి సూరిబాబు, వానపల్లి అప్పలరాజు, వెదురిపర్తి వీరభద్రరావు, ద్వారపూడి శ్రీనివాసరావు, రెడ్డి రవనమ్మ పాల్గొన్నారు.

Read more