-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » au vc says mental stress gone with sports
-
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
ABN , First Publish Date - 2020-12-15T06:17:53+05:30 IST
క్రీడలతోనే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని ఏయూ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి అన్నారు.

ఏయూ వైస్ చాన్సలర్ ప్రసాద్‌రెడ్డి
కొత్తూరు, డిసెంబరు 14: క్రీడలతోనే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని ఏయూ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఏఎంఏఎల్ కళాశాల అవుట్‌డోర్ స్టేడియం వద్ద సోమవారం 400 మీటర్ల రన్నింగ్ 9లేన్ ట్రాక్‌ను ప్రారంభించారు. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతీ రోజూ వ్యాయామం చేయాలన్నారు. ఇంటర్నెట్‌లో ఎక్కువ సమయం గడిపితే మెదడుకు ఉన్న ఆకర్షణ శక్తి బలహీనపడిపోతుందన్నారు. ఏయూ లేని సదుపాయాలను ఏఎంఏఎల్ కళాశాలలో ఏర్పాటు చేయడంపై అభినందించారు. కార్యక్రమంలో వర్తక సంఘం ప్రతినిధులు కొణతాల లక్ష్మీనారాయణ, తమ్మన రఘుబాబు, కళాశాల కరస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు, అధ్యక్షుడు కె.మంగరాజు, ఉపాధ్యక్షుడు కె.నారాయణరావు, కోశాధికారి కె.సన్యాసినాయుడు, ఏయూ పీడీ ఎన్.విజయమోహన్, డీన్ సిహెచ్.పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.