పెన్సిల్ ముల్లుపై నేవీ సింబల్
ABN , First Publish Date - 2020-12-04T05:25:25+05:30 IST
మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మకళాకారుడు గట్టెం వెంకటేశ్ తనలోని కళానైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు.

నక్కపల్లి, డిసెంబరు 3 : మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మకళాకారుడు గట్టెం వెంకటేశ్ తనలోని కళానైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. శుక్రవారం నేవీ డే సందర్భంగా 4బీ పెన్సిల్ ముల్లుపై నేవీ సింబల్‌ను అత్యద్భుతంగా చెక్కి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇందుకోసం తనకు గంటన్నర సమయం పట్టినట్టు చెప్పాడు.