-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » ARREST
-
ఉద్యోగం పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-11-25T05:51:43+05:30 IST
ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.ఐదు లక్షలు వసూలు చేసి పరారైన వ్యక్తిని మంగళవారం ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్టు చేశారు.

ఎంవీపీ కాలనీ, నవంబరు 24: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.ఐదు లక్షలు వసూలు చేసి పరారైన వ్యక్తిని మంగళవారం ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ భాస్కరరావు కథనం ప్రకారం కిలపర్తి సందర్శ అనే వ్యక్తి శివాజీపాలెంలోని ఎన్.కనకమహాలక్ష్మి అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటూ తాను గతంలో నేవీలో పనిచేసి బుల్లెట్ గాయం వల్ల రాజీనామా చేసినట్టు నమ్మబలికాడు. తన తరపున ఒకరికి నేవీలో ఉద్యోగమిస్తారని, ఆ జాబ్‌ను కనకమహాలక్ష్మి కొడుక్కి ఇప్పిస్తానని చెప్పి సందర్శ రూ.ఐదు లక్షలు వసూలు చేశాడన్నారు. ఉద్యోగం ఇప్పించకపోగా, తాను ఉంటున్న ఇంటిని వారం రోజుల కిందట ఖాళీ చేసి సందర్శ పరారయ్యాడన్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో సందర్శను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.