రెండు కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-11-20T05:25:49+05:30 IST

ఎంవీపీ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి పెదవాల్తేరులోని సాయిరామ రెసిడెన్సీ సమీపంలో ఒక కారులో ఉన్న రెండు కిలోల గంజాయి, 1.73 గ్రాముల చెరస్‌ (ఒక రకమైన మత్తు పదార్థం)ను బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రెండు కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు

ఎంవీపీ కాలనీ, నవంబరు 19: ఎంవీపీ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి పెదవాల్తేరులోని సాయిరామ రెసిడెన్సీ సమీపంలో ఒక కారులో ఉన్న రెండు కిలోల గంజాయి, 1.73 గ్రాముల చెరస్‌ (ఒక రకమైన మత్తు పదార్థం)ను బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో గంజాయి ఉన్నట్టు సమాచారం అందడంతో సీఐ రమణయ్య, ఎస్‌ఐ భాస్కరరావులు టాస్క్‌పోర్స్‌ సిబ్బందితో కలిసి సోదా చేశారు. ఈ సందర్భంగా గంజాయి, చెరస్‌ కలిగివున్న మారడా సర్వేశ్వరరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు  రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-11-20T05:25:49+05:30 IST