గిరిజన ప్రాంతం అభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2020-11-19T05:55:41+05:30 IST

గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు.

గిరిజన ప్రాంతం అభివృద్ధే ధ్యేయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మాధవి

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి


పెదబయలు, నవంబరు 18: గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. మండలంలోని మారుమూల పెదకోడపల్లి-ప్రదనపుట్టు రహదారి నిర్మాణానికి రూ.2.8 కోట్లతో బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన్యంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న 460 మంది గిరిజనులు పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇంకా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ, మండలంలో పది రహదారుల పనులు జరుగుతున్నాయని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్‌.పూర్ణయ్య, వైసీపీ నాయకులు సూర్యనారాయణ, ఉమామహేశ్వరావు, పాంగి సింహాచలం, బోంజుబాబు, వంతల ఆనందరావు, కనకరాజు, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T05:55:41+05:30 IST