-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Araku MP Anda for a sick boy
-
అనారోగ్య బాలుడికి అరకు ఎంపీ అండ
ABN , First Publish Date - 2020-12-27T06:28:09+05:30 IST
వైద్యసేవలందక అవస్థ పడుతున్న జీకే వీధి మండలం రమణపల్లి గ్రామానికి చెందిన మువ్వల బాలరాజు (11)కు పూర్తిస్థాయి ఆరోగ్యం చేకూరే వరకు తానే వైద్య సేవలు అందజేయిస్తానని అరకు ఎంపీ జి.మాధవి భరోసా ఇచ్చారు.

వైద్య సేవలకు పూర్తి ఖర్చులు భరిస్తానని హామీ
కొయ్యూరు, డిసెంబరు 26: వైద్యసేవలందక అవస్థ పడుతున్న జీకే వీధి మండలం రమణపల్లి గ్రామానికి చెందిన మువ్వల బాలరాజు (11)కు పూర్తిస్థాయి ఆరోగ్యం చేకూరే వరకు తానే వైద్య సేవలు అందజేయిస్తానని అరకు ఎంపీ జి.మాధవి భరోసా ఇచ్చారు. బాలరాజు కుటుంబం పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ మాధవి బాధితునితోపాటు తండ్రిని విశాఖలోని తన క్యాంపు కార్యాలయానికి రప్పించి వారితో మాట్లాడారు. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని తోడుగా పంపి కేజీహెచ్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. బాలుడికి పూర్తి స్వస్థత వచ్చేవరకు ఏ అవసరమైనా తనను సంప్రదించాలని వైద్యులకు చెప్పారు. ఎంపీ చొరవతో తన కొడుకు ఆరోగ్య పరిస్థితి చక్కపడుతున్నందుకు బాలరాజు తండ్రి లక్ష్మణరావు కృతజ్ఞతలు తెలిపాడు.