ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-12-12T04:34:31+05:30 IST

స్థానిక ఏకలవ్య ఆదర్శ పాఠశాల భవనం నిర్మాణానికి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
పాఠశాల భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ భాగ్యలక్ష్మి, మాధవి


చింతపల్లి, డిసెంబరు 11: స్థానిక ఏకలవ్య ఆదర్శ పాఠశాల భవనం నిర్మాణానికి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పాఠశాల భవనాల నిర్మాణానికి తొలివిడతగా కేంద్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా తరగతి, వసతి భవనాలు, భోజనశాలలు, ఉపాధ్యాయుల నివాస గృహాలు నిర్మించనున్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జల్లి హలియారాణి, ఎంపీడీవో ఉషశ్రీ, ప్రిన్సిపాల్‌ అన్నామణి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:34:31+05:30 IST