రైడ్‌ పనుల్లో అవకతవకలపై విచారణాధికారి నియామకం

ABN , First Publish Date - 2020-07-10T09:58:20+05:30 IST

విశాఖ జిల్లాలో గతంలో చేపట్టిన రూరల్‌ అండ్‌ ఇంటీరియర్‌ ఏరియా డెవలప్‌మెంట్‌(రైడ్‌) పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ..

రైడ్‌ పనుల్లో అవకతవకలపై  విచారణాధికారి నియామకం

విశాఖపట్నం, జూలై 9(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లాలో గతంలో చేపట్టిన రూరల్‌ అండ్‌ ఇంటీరియర్‌ ఏరియా డెవలప్‌మెంట్‌(రైడ్‌) పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణకు తాజాగా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈని విచారణాధి కారిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రైడ్‌ పథకంలో చేపట్టిన పనుల్లో అవకతవకలపై ఇప్పటికీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొం టున్న ఏఈలు ఇ.ఈశ్వరరావు, కేవీ సత్యనారాయణ, కె.నరసింహరాజు, ఎస్‌.రణదేవ్‌, ఎస్‌వీబీ. ప్రసాద్‌లపై పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ విచారణ చేపడ తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వి.వెంకటేశ్వరరావు అనే ఏఈ మృతిచెం దడంతో ఆయనపై విచారణను నిలిపివేశారు. 

Updated Date - 2020-07-10T09:58:20+05:30 IST