-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » APPANNA SWAMY DRSHANAM
-
త్రివిక్రముడుగా సింహాచలేశుడు
ABN , First Publish Date - 2020-12-31T05:21:31+05:30 IST
సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి భక్తులకు త్రివిక్రముడుగా దర్శనమిచ్చారు.

సింహాచలం, డిసెంబరు 30: సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి భక్తులకు త్రివిక్రముడుగా దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని త్రివిక్రముడుగా స్వర్ణాభరణాలతో అలంకరించి పల్లకిలో ఉంచి తొలుత ఆలయ బేడా మండపంలో, అనంతరం సింహగిరి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పర్యవేక్షణాఽధికారి వి.కామేశ్వరరావు, స్థానాచార్యుడు డాక్టర్ టీపీ రాజగోపాల్, ముఖ్య అర్చకుడు బీఎన్ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.