-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » APPANNA INCOME
-
అప్పన్న ఒక్కరోజు ఆదాయం రూ.21 లక్షలు
ABN , First Publish Date - 2020-12-06T05:39:38+05:30 IST
సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

కొండదిగువ పలుమార్లు స్తంభించిన ట్రాఫిక్
సింహాచలం, డిసెంబరు 5: సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో కొండదిగువ అడివివరం గ్రామ దేవత పైడితల్లమ్మ గుడి నుంచి పాత అడివివరం కూడలి వరకు పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా భక్తులు పోటెత్తడంతో శనివారం ఒక్కరోజే సింహాచల దేవస్థానానికి రూ.21 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. రూ.300, రూ.100 టికెట్ల విక్రయాల ద్వారా రూ.13,98,600 లభించగా, పులిహోర, లడ్డూ ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.4,37,855, తలనీలాల టికెట్లు రూ.1,36,800తో పాటు ఆర్జిత సేవలు, టోల్‌గేట్, తదితరాల ద్వారా సుమారు రూ.1.5 లక్షల వరకు ఆదాయం సమకూరినట్టు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది.