ముగిసిన బీజేపీ సేవా సప్తాహం

ABN , First Publish Date - 2020-09-21T10:03:22+05:30 IST

ముగిసిన బీజేపీ సేవా సప్తాహం

ముగిసిన బీజేపీ సేవా సప్తాహం

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 20: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చేపట్టిన సేవా సప్తాహ కార్యక్రమాలు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో ఆసుపత్రి ఆవరణలో ముగిశాయి. బీజేపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌  హాజరై, ముందుగా స్వచ్ఛ భారత్‌లో పాల్గొని పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ నేత ప్రధాని మోదీ అని అన్నారు. సేవ సప్తాహ పేరుతో  ఏడు రోజులపాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ డి.సునీత, ఏపీ రాష్ట్ర వైద్య విభాగ కన్వీనర్‌ రవికుమార్‌, డాక్టర్‌ అభినందన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T10:03:22+05:30 IST