రూ.4.55కోట్లతో ఆంధ్రా-ఒడిశా రోడ్డు

ABN , First Publish Date - 2020-11-16T05:27:36+05:30 IST

ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలను కలిపే 6.6 కిలోమీటర్ల రహదారిని రూ.4.55 కోట్లతో నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్‌ డీఈఈ కల్యాణ్‌ కుమార్‌ అన్నారు.

రూ.4.55కోట్లతో ఆంధ్రా-ఒడిశా రోడ్డు
ఏపీ రహదారిని పరిశీలిస్తున్న డీఈఈ కల్యాణ్‌ కుమార్‌

పీఆర్‌ డీఈఈ కల్యాణ్‌కుమార్‌

సీలేరు, నవంబరు 15:ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలను కలిపే 6.6 కిలోమీటర్ల రహదారిని రూ.4.55 కోట్లతో నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్‌ డీఈఈ కల్యాణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం ఈ రహదారిని జేఈఈ ప్రకాశ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా కల్యాణ్‌కుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలను కలిపే ఏపీ రహదారి పూర్తిగా పాడయ్యిందన్నారు. ఈ రహదారి నిర్మాణం కోసం నివేదిక పంపించగా, ప్రభుత్వం రూ.4.55 కోట్లు మంజూరు చేసిందన్నారు. టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయిందని, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు.

Updated Date - 2020-11-16T05:27:36+05:30 IST