మరో మంచు అందాలు

ABN , First Publish Date - 2020-12-25T06:06:12+05:30 IST

పర్యాటక ప్రియులకు విశాఖ మన్యం మరో పర్యాటక ప్రాంతాన్ని అందించింది. మండలంలోని వంజంగి కొండల్లో పర్యాటకుల మదిని దోచే మంచు అందాలు వంటివే మోదాపల్లి పంచాయతీ గాలిపాడు కొండల్లో ప్రకృతి ప్రియులను మైమరిపించే మంచు అందాలు వెలుగు చూశాయి.

మరో మంచు అందాలు
పర్యాటకులను ఆకర్షిస్తున్న గాలిపాడు కొండలు


గాలిపాడులో వెలుగుచూసిన సోయగం


పాడేరురూరల్‌, డిసెంబరు 24: పర్యాటక ప్రియులకు విశాఖ మన్యం మరో పర్యాటక ప్రాంతాన్ని అందించింది. మండలంలోని వంజంగి కొండల్లో పర్యాటకుల మదిని దోచే మంచు అందాలు వంటివే మోదాపల్లి పంచాయతీ గాలిపాడు కొండల్లో ప్రకృతి ప్రియులను మైమరిపించే మంచు అందాలు వెలుగు చూశాయి. వంజంగి కొండలకు దీటుగా ఉన్న గాలిపాడు కొండలను తిలకించాలంటే మినుములూరు పంచాయతీ కేంద్రంలోని కాఫీ కాలనీ మీదుగా రెండు కిలోమీటర్లు వెళితే ఈ అందాలను పర్యాటకులు ఆస్వాదించవచ్చు.

Updated Date - 2020-12-25T06:06:12+05:30 IST