ఏయూ వెలవెల

ABN , First Publish Date - 2020-03-21T10:28:53+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు

ఏయూ వెలవెల

ఏయూ క్యాంపస్‌, మార్చి20: కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు లేక ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌ బోసిపోయింది. నిత్యం రద్దీగా ఉండే వర్సిటీ సెంట్రల్‌ అడ్మిన్‌ కార్యాలయం, క్యాంటీన్‌లు, వివిధ విభాగాలు, స్పోర్డ్స్‌ గ్రౌండ్స్‌, మెస్‌లు, వసతి గృహాలు, తరగతి గదులు, విద్యార్థులు, ఉద్యోగులు లేక వెలవెలబోయాయి. దీంతో వర్సిటీలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. వివిధ పనులపై వచ్చే కొద్ది మందికి కూడా సరైన సమాధానం చేప్పే నాథుడే కరువయ్యారు. అత్యవస సర్వీసులైన పవర్‌హౌస్‌, వాటర్‌ సప్లయ్‌, సెక్యూరిటీ, శానిటేషన్‌, హెల్త్‌సెంటర్సు యథావిధిగా పనిచేశాయి. వీటిలో పనిచేసే సిబ్బంది ముక్కులకు మాస్క్‌లు, కర్చీ్‌పలు కట్టుకుని విధులకు హాజరయ్యారు. ముఖ్యమైన కొందరు అధికారులు మాత్రం విధులకు వచ్చారు. ఈనెల 31వ తేదీ వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. విద్యార్థులు అందరూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వసతి గృహాలను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లారు. 

Updated Date - 2020-03-21T10:28:53+05:30 IST