దేశం గర్వించదగ్గ మేధావి అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2020-12-07T06:03:38+05:30 IST

దేశం గర్వించదగ్గ మేధావుల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఒకరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

దేశం గర్వించదగ్గ మేధావి అంబేడ్కర్‌
అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు

 పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి

డాబాగార్డెన్స్‌, డిసెంబరు 6: దేశం గర్వించదగ్గ మేధావుల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఒకరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా డాబాగార్డెన్స్‌లోని విగ్రహానికి ఆదివారం ఆయన, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పూలమాలలువేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, శెట్టి ఫల్గుణ, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌, వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, మత్స్యకార కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కోలా గురువులు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-07T06:03:38+05:30 IST