చంద్రబాబును విమర్శించే స్థాయి అమర్‌కు లేదు
ABN , First Publish Date - 2020-12-29T05:48:14+05:30 IST
నియోజకవర్గంలో కిలోమీటరు రోడ్డు నిర్మించలేని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును విమర్శించే స్థాయి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ అన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ
అనకాపల్లి, డిసెంబరు 28: నియోజకవర్గంలో కిలోమీటరు రోడ్డు నిర్మించలేని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును విమర్శించే స్థాయి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో రోడ్లకు పడిన గోతులు కూడా పూడ్చలేని స్థితిలో ఉన్న అమర్, అభివృద్ధికి స్పూర్తిప్రధాత చంద్రబాబును విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. అలాగే విశాఖలో వెలగపూడి రామకృష్ణబాబు ఓటమి ఎరుగని నాయకుడని, అతనిని విమర్శించే హక్కు అమర్‌కు లేదన్నారు. ఆయన వెంట టీడీపీ నేత ఆళ్ల రామచంద్రరావు ఉన్నారు.