బదిలీలలో ఖాళీలన్నీ చూపించాలి

ABN , First Publish Date - 2020-12-11T04:30:13+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలలో అన్ని రకాల ఖాళీలను చూపించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) జిల్లా అధ్యక్షుడు అవనాపు అరుణ్‌కుమార్‌ కోరారు.

బదిలీలలో ఖాళీలన్నీ చూపించాలి
డీఈవోకు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

 పద్మనాభం: ఉపాధ్యాయ బదిలీలలో అన్ని రకాల ఖాళీలను చూపించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) జిల్లా అధ్యక్షుడు అవనాపు అరుణ్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డిని గురువారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. 2018 డీఎస్పీ నియామక స్థానాలను కూడా ఖాళీలుగా చూపించాలన్నారు. భాస్కర్‌, ఎం.అరుణ్‌కుమార్‌, కె.మురళి, ఎస్‌.అచ్చిబాబు, శంకర్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-12-11T04:30:13+05:30 IST