-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » aituc dharna
-
సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ధర్నా
ABN , First Publish Date - 2020-12-19T05:37:08+05:30 IST
ఉక్కు కార్మికులకు నష్టం జరిగితే సహించేది లేదని స్టీల్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ అన్నారు.

ఉక్కుటౌన్‌షిప్: ఉక్కు కార్మికులకు నష్టం జరిగితే సహించేది లేదని స్టీల్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ అన్నారు. కార్మిక సమస్యలు, వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీటీఐ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు ఉద్యోగులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఉత్పత్తి పెంచేందుకు ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెంచాలని కోరారు. కార్యక్రమంలో మసేన్‌రావు, బి.అప్పారావు, జె.రామకృష్ణ, కె.సత్యనారాయణ, కనకరాజు పాల్గొన్నారు.