-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » air india show
-
ఎయిర్ ఇండియా రోడ్‌షో
ABN , First Publish Date - 2020-12-19T05:42:14+05:30 IST
ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా నగరంలో రోడ్‌షో నిర్వహించింది.

విశాఖపట్నం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా నగరంలో రోడ్‌షో నిర్వహించింది. హైదరాబాద్ నుంచి చికాగోకు తొలి విమానం జనవరి 15 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దాని గురించి విశాఖ వాసులకు తెలియజేయడానికి రోడ్‌షో ఏర్పాటు చేశారు. చికాగో వెళ్లాలనుకునేవారు, కార్గో పంపాలనుకునేవారికి ఇది అనుకూలంగా ఉంటుందని ఎయిర్ ఇండియా స్టేషన్ మేనేజర్ సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.