త్వరితగతిన రైతుభరోసా కేంద్రాలు పూర్తి

ABN , First Publish Date - 2020-11-22T05:22:58+05:30 IST

: జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న రైతుభరోసా కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు వ్యవసాయ కమిషనర్‌ హనుమంతు అరుణ్‌కుమార్‌ ఆదేశించారు.

త్వరితగతిన రైతుభరోసా కేంద్రాలు పూర్తి
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తున్న అరుణ్‌కుమార్‌

వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

విశాఖపట్నం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న రైతుభరోసా కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు వ్యవసాయ కమిషనర్‌ హనుమంతు అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో వ్యవసాయాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలపై జాయింట్‌ కలెక్టర్‌ ఎం. వేణగోపాలరెడ్డి నుంచి అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీలో పంటదిగుబడి పెంచడం ద్వారా గిరిజన రైతుల ఆదాయం మెరుగుపడేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. త్వరలో ఏజెన్సీ రైతులకు వర్క్‌షాపు నిర్వహిస్తామన్నారు.  జేపీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్‌లో పండిన ధాన్యం కొనుగోలుకు 150 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తొలిసారిగా ఏజెన్సీలో కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. సమీక్షలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు జేఎస్‌ఎన్‌ఎస్‌ లీలావతి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 


Read more