-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » agitation
-
రజకులు వినూత్న నిరసన
ABN , First Publish Date - 2020-12-10T05:40:26+05:30 IST
బలిఘట్టం రెవెన్యూ పరిధి బయపు రెడ్డిపాలెం సర్వే నంబరు 510లో తాము దుస్తులు ఉతికి ఆరబెట్టుకునే స్థలంలో ఆక్రమణలను తొలగించాలంటూ రజకులు బుధ వారం వినూత్న నిరసన తెలిపారు.

బట్టలు ఆరబెట్టుకునే స్థలంలో ఆక్రమణలు తొలగించాలని డిమాండ్
తహసీల్దార్ కార్యాలయం వద్ద చాకిరేవు
నర్సీపట్నం, డిసెంబరు 9 : బలిఘట్టం రెవెన్యూ పరిధి బయపు రెడ్డిపాలెం సర్వే నంబరు 510లో తాము దుస్తులు ఉతికి ఆరబెట్టుకునే స్థలంలో ఆక్రమణలను తొలగించాలంటూ రజకులు బుధ వారం వినూత్న నిరసన తెలిపారు. రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద చాకిరేవు పెట్టారు. ఈ సం దర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలమండ వరహాలరాజు మాట్లాడుతూ రజకులు తమ సమస్యపై గతంలో సబ్ కలెక్టర్, తహసీల్దార్‌కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అదీకాక ఫిర్యాదు చేసినందుకు ఆక్రమణదారుడు తమను బెదిరిస్తున్నారని పలువురు వాపోయారు. ఈ సమస్యపై ఇప్పటికైనా స్పం దించాలని కోరారు. సీపీఎం నాయకుడు కె.గోవిందరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.