అక్రమ కేసులను ఎత్తివేయాలి
ABN , First Publish Date - 2020-12-01T06:08:59+05:30 IST
ప్రజా సంఘాల కార్యకర్తలు, న్యాయవాదులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఉపా రద్దు పోరాట కమిటీ, విశాఖ పౌర, ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

‘ఉపా’ రద్దు పోరాట కమిటీ, ప్రజా, పౌర సంఘాల ప్రతినిధులు డిమాండ్
సిరిపురం, నవంబరు 30: ప్రజా సంఘాల కార్యకర్తలు, న్యాయవాదులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఉపా రద్దు పోరాట కమిటీ, విశాఖ పౌర, ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రజా సమస్యలపై పోరాడుతున్న సుమారు 30 మందిపై ఉపా చట్టంతో పాటు, భారతీయ శిక్షాస్మృతి, ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులను బనాయించారని ఆరోపించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు, మానవ హక్కుల సంఘం నాయకుడు వాసిరెడ్డి శ్రీకృష్ణ, పౌర హక్కుల సంఘం నాయకుడు తుంపాల శ్రీరాములు, పలువురు న్యాయవాదులపై కేసులు నమోదు చేశారన్నారు. వీరిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, పౌర, ప్రజా సంఘాల వేదిక పి.చంద్రశేఖర్, పీవోడబ్ల్యూ లక్ష్మి, మహిళా చేతన కె.పద్మ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు ఎ.విమల, ఇతర నేతలు కేపీ సుబ్బారావు, పి.వి.రమణ, లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.