‘గీతం’ నర్సింగ్‌ కోర్సులకు ప్రవేశాలు

ABN , First Publish Date - 2020-12-29T05:30:00+05:30 IST

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ద్వారా నిర్వహిస్తున్న నాలుగేళ్ల కాల వ్యవధితో గల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు, రెండేళ్ల కాల వ్యవధి గల ఎమ్మెస్సీ నర్స్‌ ప్రాక్టీసనర్‌ ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ (ఎన్‌పీసీసీ) కోర్సుకు 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కనకలక్ష్మి తెలిపారు.

‘గీతం’ నర్సింగ్‌ కోర్సులకు ప్రవేశాలు

ఎండాడ, డిసెంబరు 29: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ద్వారా నిర్వహిస్తున్న నాలుగేళ్ల కాల వ్యవధితో గల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు, రెండేళ్ల కాల వ్యవధి గల ఎమ్మెస్సీ నర్స్‌ ప్రాక్టీసనర్‌ ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ (ఎన్‌పీసీసీ) కోర్సుకు 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కనకలక్ష్మి తెలిపారు. కొవిడ్‌ దృష్ట్యా ఆయా కోర్సులలో ప్రవేశాలను ఫిబ్రవరి 28 వరకు చేపట్టాలని ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆదేశాలు జారీ చేసిందన్నారు. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.జజ్ట్చీఝ.్ఛఛీఠ వెబ్‌సైట్‌ను తిలకించాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-29T05:30:00+05:30 IST