-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Accident
-
లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-11-01T04:55:41+05:30 IST
నాలుగులేన్ల రహదారి శాంతిపురం సిగ్నల్ కూడలి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అనంతరం ఆస్పత్రిలో కన్నుమూశాడు.

సీతంపేట, అక్టోబరు 31: నాలుగులేన్ల రహదారి శాంతిపురం సిగ్నల్ కూడలి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అనంతరం ఆస్పత్రిలో కన్నుమూశాడు. నాలుగో పట్టణ పోలీసుల కథనం మేరకు...శక్రవారం రాత్రి ఈ కూడలిలో సదరు వ్యక్తి రోడ్డు దాటుతుండగా అక్కయ్యపాలెం నుంచి గురుద్వారా వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు క్షతగాత్రుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీలో భద్రపరిచామని, మృతున వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని నాలుగో పట్టణ పోలీసులు కోరారు.