అల్లూరి స్మారక ప్రదేశాల్లో అభివృద్ధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-11-07T04:23:27+05:30 IST

మంప, రాజేంద్రపాలెంల్లో రూ.కోటితో చేపట్టిన అల్లూరి స్మారక ప్రదేశాల అభివృద్ధి పనులను ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌, ఎమ్మెల్సీ మాధవ్‌ శుక్రవారం పరిశీలించారు.

అల్లూరి స్మారక ప్రదేశాల్లో అభివృద్ధి పనుల పరిశీలన
అల్లూరి పార్కును పరిశీలిస్తున్న పీవో వెంకటేశ్వర్‌, ఎమ్మెల్సీ మాధవ్‌

కొయ్యూరు, నవంబరు 6: మంప, రాజేంద్రపాలెంల్లో రూ.కోటితో చేపట్టిన అల్లూరి స్మారక ప్రదేశాల అభివృద్ధి పనులను ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌, ఎమ్మెల్సీ మాధవ్‌ శుక్రవారం పరిశీలించారు. అల్లూరి ధ్యానం చేసుకున్న ఉర్వకొండపై గల గుహలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ మాధవ్‌ పీవోను కోరారు. అలాగే స్మారక మందిరాలలో అల్లూరి అనుచరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని, లైబ్రరీకి విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కోరారు. పీవో వెంట ఆర్‌డీవో లక్ష్మీశివజ్యోతి, టీడబ్ల్యూ డీఈఈ డీవీఆర్‌ఎంం రాజు, తహసీల్దారు శ్రీధర్‌, ఎంపీడీవో మేరీరోస్‌ పాల్గొన్నారు. 

       

Updated Date - 2020-11-07T04:23:27+05:30 IST