వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ : డీఐజీ

ABN , First Publish Date - 2020-03-30T10:36:42+05:30 IST

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి నిత్యావసర సరుకులు ఉంటే అనుమతి ఇవ్వాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి.రంగారావు అన్నారు.

వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ : డీఐజీ

పాయకరావుపేట/నక్కపల్లి/అనకాపల్లి టౌన్‌: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి నిత్యావసర సరుకులు ఉంటే అనుమతి ఇవ్వాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి.రంగారావు అన్నారు. ఆదివారం పాయకరావుపేట వైజంక్షన్‌ వద్ద ఉన్న అంతర జిల్లా చెక్‌పోస్టుని ఆయన పరిశీలించారు. కొద్దిసేపు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులతో మాట్లాడుతూ నిత్యావసర సరుకులు తప్ప మిగిలిన వాహనాలపై కేసులు నమోదు చేయాలని సూచించారు.


నక్కపల్లిలో సీఐ విజయకుమార్‌, ఎస్‌ఐ శివరామకృష్ణ నుంచి వివరాలు సేకరించారు. లాక్‌డౌన్‌ సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం అనకాపల్లి నాలుగురోడ్ల జంక్షన్‌ వద్ద ఉన్న చెక్‌పోస్టును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  నెహ్రూచౌక్‌లో పోలీస్‌ అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన వెంట అదనపు ఎస్పీ(క్రైమ్‌) బి.అచ్యుతరావు, డీఎస్‌పీలు పి.శ్రీనివాసరావు, శ్రావణి, ట్రైనీ డీఎస్‌పీ కిశోర్‌కుమార్‌, అనకాపల్లి టౌన్‌ సీఐ ఎల్‌.భాస్కరరావు, పాయకరావుపేట ఎస్‌ఐ ఎ.విభీషణరావు తదితరులున్నారు. 

Updated Date - 2020-03-30T10:36:42+05:30 IST