-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » A rich alumni association
-
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , First Publish Date - 2020-12-28T04:57:11+05:30 IST
తాము చదువుకున్న ప్రభుత్వ హైస్కూల్‌లో గ్రంథాలయం ఏర్పాటుకు రూ.25 వేలు విరాళాన్ని హైస్కూల్ పూర్వ విద్యార్థులు ప్రకటించారు.

పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు రూ.25 వేలు వితరణ
పాడేరురూరల్, డిసెంబరు 27: తాము చదువుకున్న ప్రభుత్వ హైస్కూల్‌లో గ్రంథాలయం ఏర్పాటుకు రూ.25 వేలు విరాళాన్ని హైస్కూల్ పూర్వ విద్యార్థులు ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో 1989-90 సంవత్సరంలో పదో తరగతి చదివిన 60 మంది పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో కలుసుకున్నారు. 30 ఏళ్ల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము విద్యను అభ్యసించిన పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, రూ.25 వేలు విరాళాలు ప్రకటించారు. ప్రతీ ఏటా కుటుంబ సమేతంగా అందరూ పాఠశాలలో కలవాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జనపరెడ్డి రమేష్, బూరెడ్డి కొండబాబు, రాజు, నేతాజి, రాంప్రసాద్, గిడ్డి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.