యాంటీ డ్రగ్‌ డ్రైవ్‌లో 64 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-16T05:06:45+05:30 IST

ఈ నెల 15 నుంచి 27 వరకు నిర్వహించిన యాంటీ డ్రగ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో పలువురుని అరెస్టు చేసి 64 కిలోల గంజాయి, నిషేదిత గుట్కాను స్వాధీనం చేసుకున్నామని స్పెషన్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో ఏడీసీపీ అజితా వేజెండ్ల తెలిపారు.

యాంటీ డ్రగ్‌ డ్రైవ్‌లో 64 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయిని పరిశీలిస్తున్న ఏడీసీపీ అజితా, ఏసీపీ హర్షిత

ఏడీసీపీ అజిత 


మహారాణిపేట, డిసెంబరు 15: ఈ నెల 15 నుంచి 27 వరకు నిర్వహించిన యాంటీ డ్రగ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో పలువురుని అరెస్టు చేసి 64 కిలోల గంజాయి, నిషేదిత గుట్కాను స్వాధీనం చేసుకున్నామని స్పెషన్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో ఏడీసీపీ అజితా వేజెండ్ల తెలిపారు.  మంగళవారం పోలీసు కమిషనరేట్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దువ్వాడ ప్రాంతానికి చెందిన తాడిపల్లి రాజు రైళ్లలో టీ,సమోసా అమ్ముతూ కిర్లంకోట నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకుని 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సఫల్‌జా (21) అన్సుజా (19) మరొకరు సీలేరులో పంకజ్‌కుమార్‌ అనే మధ్యవర్తి ద్వారా రాజేంద్ర అనే వ్యక్తి నుంచి 60 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తీసుకువస్తుండగా విశాఖ రైల్వేస్టేషన్లో పట్టుకుని అరెస్టు చేశామన్నారు. అల్లిపురంలో ఉంటున్న హరిహర పండా, మనోజ్‌కుమార్‌, రాజీవ్‌కుమార్‌లు  నిషేధిత పాన్‌మసాలా, గుట్కాలను కలిగి ఉండడంతో దాడిచేసి సరుకు స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఈస్ట్‌ ఏసీపీ హర్షితా చంద్రా పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-16T05:06:45+05:30 IST