క్రిస్మస్‌కు 60 ప్రత్యేక బస్సు సర్వీసులు

ABN , First Publish Date - 2020-12-25T05:32:24+05:30 IST

ప్రజారవాణాశాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ గురువారం 60 ప్రత్యేక సర్వీసులు నడిపింది. శుక్రవారం క్రిస్మస్‌ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ చర్యలు తీసుకుంది.

క్రిస్మస్‌కు 60 ప్రత్యేక బస్సు సర్వీసులు

ద్వారకాబస్‌స్టేషన్‌, డిసెంబరు 24: ప్రజారవాణాశాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ గురువారం 60 ప్రత్యేక సర్వీసులు నడిపింది. శుక్రవారం క్రిస్మస్‌ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ చర్యలు తీసుకుంది. షెడ్యూల్‌ సర్వీసులకు మించి డిమాండ్‌ ఉండడంతో గురువారం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు  కాకినాడకు 8, రాజమండ్రికి 8, విజయనగరానికి 10, సాలూరు, బొబ్బిలి ప్రాంతాలకు ఐదేసి, శ్రీకాకుళానికి 10, టెక్కలి, పలాస, సోంపేట, మందస  మూడేసి,  పాతపట్నంకు రెండు సర్వీసులు నడిపారు. డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్లు సుధాబిందు (అర్బన్‌), కణితి వెంకటరావు(జిల్లా) ట్రాఫిక్‌ నియంత్రణను పర్యవేక్షించారు. క్రిస్మస్‌ అనంతరం తిరుగు ప్రయాణికుల రవాణాకు శనివారం కూడా ప్రత్యేక సర్వీసులు నడిపే అవకాశం ఉందన్నారు. 


Updated Date - 2020-12-25T05:32:24+05:30 IST