31 రాత్రి పది గంటల తర్వాత అన్నీ మూసేయాలి

ABN , First Publish Date - 2020-12-28T04:58:29+05:30 IST

ఈనెల 31వ తేదీ రాత్రి పది గంటల తర్వాత ఎక్కడా ఈవెంట్స్‌, డీజేలు, పార్టీలు జరపకూడదని పాడేరు డీఏస్‌పీ రాజ్‌కమల్‌ స్పష్టం చేశారు.

31 రాత్రి పది గంటల తర్వాత అన్నీ మూసేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పాడేరు డీఏస్‌పీ రాజ్‌కమల్‌


పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్‌

అరకులోయ, డిసెంబరు 27: ఈనెల 31వ తేదీ రాత్రి పది గంటల తర్వాత ఎక్కడా ఈవెంట్స్‌, డీజేలు, పార్టీలు జరపకూడదని పాడేరు డీఏస్‌పీ రాజ్‌కమల్‌ స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం రిసార్టులు, హోటళ్లు, లాడ్జీలు, టెంట్‌హౌస్‌ల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక ప్రాంతమైన అరకులోయలో పర్యాటకులు పెద్ద ఎత్తున అరకులో బస చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం విధించిన అంక్షలను వివరించారు. ఈనెల 31వ తేదీ రాత్రి పది గంటల తర్వాత అన్నీ మూసివేయాలన్నారు.ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్‌పీ రాజ్‌కమాల్‌ హెచ్చరించారు. పట్టణంలో రాత్రి వేళ ప్రత్యేక పోలీస్‌ బృందాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రభుత్వం విధించిన నియమ, నిబంధనలను పాటించి సహకరించాలన్నారు. సీఐ పైడయ్య, ఎస్‌ఐ జోగారావు, హోటల్స్‌,  రిసార్టులు, టెంట్‌ల నిర్వాహకులు ఙపాల్గొన్నారు.  

Updated Date - 2020-12-28T04:58:29+05:30 IST