28 నుంచి ఏయూ పీజీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-17T12:34:00+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌, ప్రొఫెషనల్‌ కోర్సుల పరీక్షల నిర్వహణకు తేదీలను ఖరారు చేసినట్టు పీజీ పరీక్షల కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ జె.ఆదిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్‌ కోర్సులకు సెప్టెంబరు 28 నుంచి

28 నుంచి ఏయూ పీజీ పరీక్షలు

విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌, ప్రొఫెషనల్‌ కోర్సుల పరీక్షల నిర్వహణకు తేదీలను ఖరారు చేసినట్టు పీజీ పరీక్షల కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ జె.ఆదిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్‌ కోర్సులకు సెప్టెంబరు 28 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు.


ఆర్ట్స్‌లో ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, హిందీ, సంస్కృతం, ఆంత్రోపాలజీ, యోగా కోర్సులకు సెప్టెంబరు 28 నుంచి, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, చరిత్ర, ఆర్కియాలజీ, హెచ్‌ఆర్‌ఎం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్‌, సంగీతం, ఫిలాసఫీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌, తెలుగు, థియేటర్‌ ఆర్ట్స్‌, వుమెన్‌ స్టడీస్‌, సోషియాలజీ, హెచ్‌ఆర్‌డీ కోర్సులకు అక్టోబరు ఏడో తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయన్నారు. బి.ఫార్మసీ పరీక్షలు సెప్టెంబరు 21 నుంచి, లా పరీక్షలు అక్టోబరు 7 నుంచి, బీఈడీ పరీక్షలు అక్టోబరు 8 నుంచి నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలు ఏయూ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చునన్నారు. 

Updated Date - 2020-09-17T12:34:00+05:30 IST