ధాన్యం కొనుగోలుకు 27 కేంద్రాలు

ABN , First Publish Date - 2020-04-25T09:03:50+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 27 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని జాయుంట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ శుక్రవారం వెల్లడించారు

ధాన్యం కొనుగోలుకు 27 కేంద్రాలు

సిరిపురం: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 27 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని జాయుంట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో రబీ పంట కాలంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు వరి, మొక్కజొన్న రెండు ప్రధాన పంటలు ఉన్నాయన్నారు. జిల్లాలో వరి పంట 6519 హెక్టార్లలోను, మొక్కజొన్న 663 హెక్టార్లలోను మొత్తం 16 మండలాల్లో సాగు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ధాన్యం సాధారణ రకం రూ.15,150, గ్రేడ్‌-ఏ రకం రూ.18,350లు మద్దతు ధరగా నిర్ణయించినట్టు చెప్పారు. 

Updated Date - 2020-04-25T09:03:50+05:30 IST