జిల్లాలో 144 సెక్షన్‌ : కలెక్టర్‌ వినయ్‌ చంద్‌

ABN , First Publish Date - 2020-03-23T09:16:55+05:30 IST

జిల్లాలో 114 సెక్షన్‌ విధిస్తున ్నట్టు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ...

జిల్లాలో 144 సెక్షన్‌ : కలెక్టర్‌ వినయ్‌ చంద్‌

విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 114 సెక్షన్‌ విధిస్తున ్నట్టు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ ఐదుగురికి మించి ఒకచోట గుమికూడదని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. నిత్యవసర సరకులు విక్రయించే దుకాణాలు మినహా మిగిలిన వ్యాపారాలు ఏవీ నిర్వహించకూడదని స్పష్టం చేశారు.


హోటళ్లు తెరవకూడదని పేర్కొన్నారు. మందులు, ఆయిల్‌, గ్యాస్‌ తయారీ సంస్థలు మినహా మిగిలిన ఉత్పత్తి సంస్థలు ఏవీ పనిచేయకూడదని వివరించారు. ఈ నిబంధనలన్నీ ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయన్నారు. నిత్యావసర సరకులు తీసుకువెళ్లే వాహనాలు, రోగులను తరలించే వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. వాటిని దుర్వినియోగం చేస్తే అంగీకరించబోమని హెచ్చరించారు.  

Updated Date - 2020-03-23T09:16:55+05:30 IST