ఏనుగులను పట్టుకున్న యువకులు

ABN , First Publish Date - 2020-12-30T06:08:20+05:30 IST

ఎక్కడో సినిమాల్లో తప్ప...బుల్లి ఏనుగులను అంత దగ్గరగా వారెప్పుడూ చూడలేదు. పైగా ఊరిలోకి వచ్చింది. ఇంకేం... పిల్లలు.. యువకులు అందరూ వాటి చుట్టూ చేరారు. ఆటలాడారు. ఓవైపు తల్లి ఏనుగులు ఎటువైపు నుంచి వస్తాయోనన్న భయం వెంటాడుతున్నా... ఆ బుల్లి ఏనుగు పిల్లలను వారు విడిచిపెట్టలేదు.

ఏనుగులను పట్టుకున్న యువకులు



 సుర్లా గ్రామంలోకి ప్రవేశించిన  వైనం

 ఒడిశా సరిహద్దులో మత్తేభాలు

ఇచ్ఛాపురం, డిసెంబరు 29: 

ఎక్కడో సినిమాల్లో తప్ప...బుల్లి ఏనుగులను అంత దగ్గరగా వారెప్పుడూ చూడలేదు. పైగా ఊరిలోకి వచ్చింది. ఇంకేం... పిల్లలు.. యువకులు అందరూ వాటి చుట్టూ చేరారు. ఆటలాడారు. ఓవైపు తల్లి ఏనుగులు ఎటువైపు నుంచి వస్తాయోనన్న భయం వెంటాడుతున్నా... ఆ బుల్లి ఏనుగు పిల్లలను వారు విడిచిపెట్టలేదు. కాసేపు సరదాగా ఆటలాడుకున్నారు. వాటితో సెల్ఫీలు దిగారు. ఇదీ ఒడిశాలోని సుర్లా గ్రామంలో మంగళవారం నాటి దృశ్యం. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నాలుగు రోజులుగా ఏనుగులు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. రెండు మూడు రోజులుగా ఇచ్ఛాపురం మండలంలో  అలజడి సృష్టించిన ఏనుగులు.. .మంగళవారం సరిహద్దులోని ఒడిశా భూభాగంలోకి ప్రవేశించాయి. డొంకూరు సముద్ర తీరం మీదుగా ఒడిశాలోని సుర్లా గ్రామ పరిసరాల్లోకి ఏనుగుల గుంపు చేరుకుంది. ఈ గుంపు నుంచి విడిపోయిన కొన్ని ఏనుగు పిల్లలు సుర్గా గ్రామంలోకి చేరుకున్నాయి. దీంతో స్థానిక యువకులు, పిల్లలు వాటిని చూసి ముచ్చటపడ్డారు. అక్కున చేర్చుకున్నారు. సపర్యలు చేసి... మళ్లీ ఊరి పొలిమేరల్లో విడిచిపెట్టారు. 

Updated Date - 2020-12-30T06:08:20+05:30 IST