నిబంధనలు పాటించాల్సిందే..

ABN , First Publish Date - 2020-12-14T05:12:34+05:30 IST

వాహనాల చోదకులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాల్సిందేనని, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సీఐ ఆర్‌.నీలయ్య అన్నారు. ఆదివారం స్థానిక జాతీయరహదారి వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడారు.

నిబంధనలు పాటించాల్సిందే..
ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న సీఐ నీలయ్య


టెక్కలి, డిసెంబరు 13: వాహనాల చోదకులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాల్సిందేనని, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సీఐ ఆర్‌.నీలయ్య అన్నారు. ఆదివారం స్థానిక జాతీయరహదారి వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. నిబంధనలు అతిక్రమించి వాహ నాలు నడపరాదని, మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓవర్‌లోడ్‌ ప్రయాణం కూడా ప్రమాదకర మన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. 

 



 

Updated Date - 2020-12-14T05:12:34+05:30 IST