మహిళల్లో దృఢ సంకల్పం అవసరం
ABN , First Publish Date - 2020-03-08T10:16:44+05:30 IST
మహిళలు అబలలు కాదని. సబలలని, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కేంద్ర మాజీ

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి
శ్రీకాకుళం కల్చరల్, మార్చి 7: మహిళలు అబలలు కాదని. సబలలని, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. శనివారం స్థానిక బాలికల పాఠశాలలో గీతాశ్రీకాంత్ ఫౌండేషన్, నిర్భయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యావంతులైన యువతులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మహిళా సమస్యలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలన్నారు. సీఎం జగన్ మహిళలను గౌరవిస్తూ దిశ చట్టాన్ని అమలు చేసి దిశ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేశారన్నారు.
వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు గీతాశ్రీకాంత్ మాట్లాడుతూ.. బాలికలకు, మహిళలకు ఆత్మరక్షణగా ఉండేందుకు కరాటే, తైక్వాండో, బాక్సింగ్ అంశాల్లో శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సీహెచ్ మహాలక్ష్మి, డీటీవో జి.నిర్మలమ్మ, హెచ్‌ఎం వాగ్దేవి, టి.సావిత్రి, ఎస్‌ఐ వి.వాణిశ్రీ, సేవకురాలు కె.అన్నపూర్ణమ్మ, హారికా నారాయణమ్మలను సత్కరించారు. కార్యక్రమంలో తంగి స్వాతి, పేర్ల అనురాధ, పి.భార్గవి, ఆర్.లక్ష్మి, జె.హారతి తదితరులు పాల్గొన్నారు.