మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-15T10:47:04+05:30 IST

సంతానం కలగలేదన్న మనస్తాపంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి రెండో పట్టణ

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

శ్రీకాకుళం క్రైం, మార్చి 14:  సంతానం కలగలేదన్న మనస్తాపంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి రెండో పట్టణ పోలీసులు  అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.  శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం సమీపంలో   నివాసం ఉంటున్న టేకి వనజ (38)  అదే ప్రాంతానికి చెందిప హారీఫ్‌ ని ప్రేమించి 2012లో వివాహం చేసుకుంది.


వివాహమై ఎనిమిదేళ్లు గడిచినా  సంతాన కలగక పోవటంతో శుక్రవారం తన నివాసంలో పురుగు మందు తాగి  ంది.  భార్య ఇంట్లో అపస్మారక స్థితిలో  కనిపించటంతో ఆమెను  సర్వజన ఆసుపత్రికి  హారీఫ్‌ తరలించాడు.  అక్కడ ఆమె చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మృతి చెందింది. ఈమేరకు మృతురాలి అన్న టేకి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జోగారావు తెలిపారు. 

Updated Date - 2020-03-15T10:47:04+05:30 IST