పన్నుల పెంపు జీవోలు ఉపసంహరించుకోండి
ABN , First Publish Date - 2020-12-04T04:45:21+05:30 IST
పన్నులు పెంచేందుకు జారీ చేసిన 196, 197, 198 జీవోలు తక్షణమే ప్రభుత్వం ఉపసంహారించుకోవాలని సిటిజన్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు.

పన్నుల పెంపు జీవోలు ఉపసంహరించుకోండి
ఆమదాలవలస: పన్నులు పెంచేందుకు జారీ చేసిన 196, 197, 198 జీవోలు తక్షణమే ప్రభుత్వం ఉపసంహారించుకోవాలని సిటిజన్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఫోరం నాయకులు బి.మోహనరావు, బి.జనార్దనరావు ఆధ్వర్యంలో ఆమదాలవలస మునిసిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్ చట్టాలను సవరిస్తూ ఆస్తిపన్ను పెంచేందుకు జారీచేసిన ఆర్డినెన్స్‌తో పట్టణ ప్రజలపై భారంపడుతుందని ఫోరం నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో కూన సంజీవినాయుడు, కె.జనార్దనరావు, పి.వరహానరసింహాలు పాల్గొన్నారు.